
సహోదరులు ఐక్యత కలిగి
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) వాక్యమును విడచి ఐక్యత లోపించి తొలగిపోయిరి… ప్రభు కృప నుండి సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు|| సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2) క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి అపహసించిరి… సువార్త సేవను పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు||


Follow Us