
గగనము చీల్చుకొని
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2) పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను (2) నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్న నీ వలె రూపించుచున్నది (2) కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను (2) యుగయుగాలు నీతో ఏలెదను (2) నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యము నిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2) అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో (2) సీయోనులో నీతో నేనుందును (2)


Follow Us