LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సాక్ష్యమిచ్చెద


సాక్ష్యమిచ్చెద -మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెద
సాక్ష్యమనగ గనిన వినిన - సంగతులను దెల్పుటయే
సాక్షమిచ్చు కొరకు నన్ను - స్వామి రక్షించెనంచు

దిక్కు దెసయు లేని నన్ను - దేవుడెంతో కనికరించి
మక్కువతో నాకునెట్లు - మనశ్శాంతి నిచ్చినాడో

పల్లెటూళ్ల జనుల రక్షణ - భారము నా పైని గలదు
పిల్లలకును పెద్దలకును - బ్రేమతో నా స్వానుభవము

బోధచేయలేను వాద - ములకు బోను నాకదేలు
నాధుడేసు ప్రభుని గూర్చి - నాకు దెలిసినంత వరకు

పాపులకును మిత్రుడంచు - బ్రాణమొసగి లేచెనంచు
పాపముల క్షమించునంచు - ప్రభుని విశ్వసించుడంచు

చోరులైన జారుల నా - చారులైన నెవ్వరైన
ఘోరపాపులైన గ్రీస్తు - కూర్మితో రక్షించునంచు

పరమత దూషణము లేల - పరిహసించి పలుకుటేల
ఇరుగు పొరుగు వారికెల్ల - యేసుక్రీస్తు దేవుడంచు

ఎల్లకాల మూరకుండ - నేల యాత్మ శాంతిలేక
తల్లడిల్లు వారలకు - తండ్రి కుమారాత్మ పేర

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words