
సాగిలపడి మ్రొక్కెదము
సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని మోషే కంటే శ్రేష్టుడు - అన్ని మోసముల నుండి విడిపించున్ వేషధారులను ద్వేషించున్ - ఆశతో మ్రొక్కెదము అహరోనుకంటే శ్రేష్టుడు - మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు - అందరము మ్రొక్కెదము ఆలయముకన్న శ్రేష్టుడు - నిజ ఆలయముగా తానే యుండెన్ ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము యోనా కంటె శ్రేష్టుడు - ప్రాణదానముగా తన్ను అర్పించెన్ మానవులను విమోచించెన్ - ఘనపరచి మ్రొక్కెదము సొలొమోనుకన్న శ్రేష్టుడు - సర్వ జ్ఞానమునకు ఆధారుండు పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము రాజులకంటె శ్రేష్టుడు - యాజకులనుగా మనలను చేసెన్ రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము అందరిలో అతి శ్రేష్టుడు - మనకందరికి తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము


Follow Us