
సాత్వీకుడా దీనులను
సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య } 2 సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు } 2 సమృద్ది అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము } 2|| సాత్వీకుడా || ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై నిలువనీడకరువై శిలువపై ఒంటరయ్యావు } 2 అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నను తుదివరకు } 2|| సాత్వీకుడా || కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది } 2 గుండెలో నిండిన స్తుతినొందే పూజ్యుడా మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా } 2|| సాత్వీకుడా ||


Follow Us