
సిలువలో ఆ సిలువలో
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు (2) కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి|| నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2) నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2) సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2) ||వెలి||


Follow Us