LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సిలువలో సాగింది


సిలువలో సాగింది యాత్ర - కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే

పాలుగారె దేహము పైన - పాపాత్ముల కొరడాలెన్నో 
నాట్యమాడినాయి - నడివీధిలో నడిపాయి - నోరు తెరువలేదాయె - ప్రేమా
బదులు పలుకలేదాయె- ప్రేమా 

చెళ్లుమని కొట్టింది ఒకరు - తన మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు - బాధలను పెట్టినారు - నోరు తెరువలేదాయె
ప్రేమా - బదులు పలుకలేదాయె - ప్రేమా 

వెనుక నుండి తన్నింది ఒకరు - తన ముందు నిలచి నవ్వింది
మరియొకరు - గేలిచేసినారు - పరిహాసమాడినారు
నోరు తెరువలేదాయె - ప్రేమా - బదులు పలుకలేదాయె - ప్రేమా 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words