
సింహసనాశీనుడైన నా దేవా
సింహసనాశీనుడైన నా దేవా - కొనియాడెదను నిన్నే ఇహమందు సర్వలోకానికి చక్రవర్తి నా దేవా - స్తుతియించెదను నిన్నే ప్రతిదినము జగమంత ఏలుచున్న దేవుడ నీవే - నీ ఆధీనములో నన్ను ఉంచుమయ్యా యుగయులకు కీర్తనీయుడవు నీవే - నీ ఆత్మను మా పై కుమ్మరించుమయ్యా నీ మాటలో స్వస్థత నీ చూపులో స్వస్థత నీ స్పర్శలో స్వస్థత నిలువెల్ల స్వస్థత నా దేవా నిన్ను చూచిన క్షణం - మైమరచితిని నన్ను నేనే నీ కృప నా యెడల హెచ్చుగా వున్నది నీ విశ్వాస్యత నాలో నిరంతరం నిలుచును పక్షిరాజు యౌవనమువలే నా ఆత్మ బలము నూతన మగును నీ శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు నీ రక్షణ శృంగము నన్ను ఆదుకొనును నా బ్రతుకు దినములన్నియు - కృపా క్షేమములే వచ్చును


Follow Us