
సుందరుడా.. పరిపూర్ణుడా.
సుందరుడా.. పరిపూర్ణుడా.. దూతగానాలలో.. పరవశుడా మహిమ నొందితివి.. మహిమతో మాపై వ్రాలితివి (2) 1)రాగాములేని వారము మేము పాటలుపాడి సేవిస్తుండగా (2) కలిపితివి.. ఆత్మనాధం మాలోనా నిలిచితివి.. స్తుతుల మద్యలో మాతోనా 2)అర్హతలేని వారము మాకు ఆరాధించే అర్హతనిచ్చి (2) చేసితివి.. పరిశుద్ధజనముగ సంఘమును ఇచ్చితివి.. సీయోనుపురములో స్వాస్థ్యమును 3)ఆదరణలేని ఒంటరి బ్రతుకులో వేదనపడుచు జీవిస్తుండగా (2) వచ్చితివి.. ఆదరణకర్తగా హృదిలోకి చెప్పితివి.. నీతోనేను ఉంటానని 4)విద్యలేని పామరుడను నేను చేపలు పడుతు జీవిస్తుండగా (2) పిలిచితివి.. నీ పాద సేవకు కృపతోనా నిలిచితివి.. దేవా నీ సేవాలో నాతోనా


Follow Us