
సుధా మధుర కిరణాల అరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) ||సుధా|| లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2) ||సుధా||


Follow Us