LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సుమధుర స్వరముల గానాలతో


సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన 
మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం 
                   
ఎడారి త్రోవలో  నేనడచిన - ఎరుగని మార్గములో నను నడిపిన
నా ముందు నడిచిన జయవీరుడా - నా విజయ సంకేతమా 
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము  
                   
సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక  - నా ధైర్యము నీవేగా  
నీవే నీవే - నా జయగీతము
నీవే నీవే - నా స్తుతిగీతము 
              
వేలాది నదులన్ని నీమహిమను - తరంగపు పొంగులు  నీబలమును
పర్వత శ్రేణులు నీకీర్తినే - ప్రకటించుచున్నావేగా
నీవే నీవే - నా అతిశయము
నీకే నీకే - నా ఆరాధన  
               

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words