
స్తుతి పాడెదను
స్తుతి పాడెదను ప్రతి దినము - స్తుతి పాడుటే నా అతిశయము అ.ప: ధవళవర్ణుడా మనోహరుడా - రత్నవర్ణుడా నా ప్రియుడా ఆరాధించెద అరుణోదయమున - అమరుడనిన్నే ఆశ తీర అశ్రిత జనపాలకా అందుకో నా స్తుతిమాలిక గురి లేని నన్ను ఉరి నుండి లాగి - దరిచేర్చినానే పరిశుద్ధుడా ఏమని పాడెద దేవా - ఏమని పొగడెద ప్రభువా మతిలేని నన్ను శ్రుతిచేసినావే - మృతి నుండి నన్ను బ్రతికించినావే నీ లతనై పాడెద దేవా - నా పతివని పొగడెద ప్రభువా


Follow Us