
స్తుతి సింహాసనాసీనుడా
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగయుగాలు నే పాడెదన్ నా వేదనలో నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి నీ కోసమే – నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా నీ సేవలోనే తరియించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ కోసమే – నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా నా ఆశయముతో నా కోరికతో నా గురి నీవని పరుగిడుచుంటిని నీ కోసమే – నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా


Follow Us