
స్తుతి స్తోత్రార్హుడా యేసయ్యా
స్తుతి స్తోత్రార్హుడా యేసయ్యా తరతరములకు పూజ్యుడా స్తుతి ఆరాధన నీకేనయ్యా యుగయుగములకు ఆరాధ్యుడా వందనం వందనం యేసు రాజా నీకే నా వందనం నలిగిన నాహృదయం దృఢపరచి శ్రమల సంకెళ్లను తొలగించితివి దు:ఖ దినమున ఓదార్చీ ఉల్లాస వస్త్రమును ధరియింపజేసితివి దీవెన వర్షములు నాపై కురిపించి మోడైన నాబ్రతుకు చిగురింపజేసితివి తోటమాలివై ననుగా చి ఆత్మ ఫలముతో ఫలియింపజేసితివి ఒంటరినైన నన్ను వేలకొలదిగజేసి నిత్యమైన వాత్సల్యం నాపై చూపితివి నిత్యనింబంధన నాతో చేసి శోభాతిశయముగ నను మార్చితివి


Follow Us