LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


స్తుతులకు పాత్రుడా


స్తుతులకు పాత్రుడా - సజీవుడవైన దేవా
స్తుతించి కీర్తించి - ఘనపరచెదను - ఆరాధించి ఆనందింతును

పాపపు ఊబి నుండి - లేవనెత్తితివి నీవేగా
పాపపు భారము తొలగించితివి - ఆరాధించి ఆనందింతును

చీకటి బ్రతుకులలో - వెలుగుగా వచ్చితివి
పరమానందము నాకొసగితిని ఆరాధించి ఆనందితును

నరకపు శిక్షనుండి - విమోచించితివి యేసయ్యా
ఆశ్చర్యకరమైన ఆత్మను నొసగన్ - ఆరదించి ఆనందింతును

సింహాసనాసీనుడా దేవా వేగమెరానుంటివి
పరలోకవిందులో నిమోముజూసి ఆరాధించి ఆనందింతును

ఏమని కీర్తింతును - నీవు చేసిన మేలులకై
నా జీవితమర్పించి - నీసేవజేసి ఆరాధించి ఆనందింతును

రాజ్యము నీ దేనయ్యా - యుగయుగముల
ఏలువాడ - రాజ్యవారసునిగ నను జేసితివి
ఆరాధించి ఆనందింతును

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words