
స్తోత్రాలు చెల్లించి
స్తోత్రాలు చెల్లించి - గానాలు చేద్దామా అ.ప. ప్రభుయేసుని సన్నిధి చేర రండి - ప్రభుయేసు భక్తులారా లెండి మానవ శిక్షను బాపింది యేసునాధుడే - మనకు రక్షణ ఇచ్చింది యేసునాధుడే పాపికి శరణం ఇలలోన - యేసునాధుడే పాప రోగ మందు ఇలలో - యేసునాధుడే అందుకే మరణపు ముల్లును విరచింది - యేసునాధుడే మరణభయమును బాపింది - యేసునాధుడే పరముకు మనలను కొనిపోయే - యేసునాధుడే పరిశుద్ధాత్మను ఇచ్చింది - యేసునాధుడే అందుకే రోగులకెల్ల స్వస్థత నిచ్చేది - యేసునాధుడే కృంగిన వారిని లేవనెత్తేది - యేసునాధుడే బాధితులకు న్యాయం తీర్చేది - యేసునాధుడే రాగం తాళం జీవితమంతా - యేసునాధుడే అందుకే


Follow Us