
స్తోత్రించెదము - స్తోత్రించెదము
స్తోత్రించెదము - స్తోత్రించెదము యేసుదేవుడా మా జీవనాధ - ప్రేమనాధ స్తోత్రించెదము ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని యేడు దీపంబుల మధ్య - సంచరించువాడా మొదటివాడ కడపటివాడా - మృతుడైనవాడా మృతినిగెల్చి లేచినవాడా - మదినిను దలచెదమూ వాడియైన రెండంచుల - ఖడ్గము కలవాడా పాడి నిన్ను భజియించెదము - పరమ పురి వాస అగ్నిజ్వాల వంటి - కన్నులు కలిగినవాడా అపరంజిని బోలిన - పాదముల దేవుని కుమార ఏడు నక్షత్రములు - దేవుని యేడాత్మలునూ కలిగిన వాడా కరుణించి - మము కాపాడుమయ్యా దావీదు తాళపుచెవిని - బడసినవాడా సత్యస్వరూపి పరిశుద్ధుండా -సంఘములకు కర్తా ఆమెన్ అనువాడా - నమ్మకమైన నా నాథుడా సత్యసాక్షి దేవుని సృష్టికి - అదియు నీవేగా


Follow Us