LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


స్వచ్ఛంద సీయోను వాసి


స్వచ్ఛంద సీయోను వాసి - సర్వాధికారి - కస్తూరి పూరాసి - వర్తమాన
భూత భవిష్యత్కాల వాసి - ఆల్ఫా ఓమెగయు తానే - ఆద్యంతము మన యేసే

ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముగ జేతున్
నీప్రజలందరి యెదుట - పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే
లెక్కలేని యద్భుతముల్ మక్కువతో చేయువాడు

సంగీత నాదములతోడ - సీయోను పురము సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా - శిరముల పై వెల సెన్
దు:ఖము నిట్టూర్పును పోయెస్ - మిక్కిలి ఆనందముగలైన్

నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య మణులతో
సువర్ణ సునీయముల సూర్యకాంతముతో
ప్రశస్త రత్నములతో - ప్రవిమలముగ నిను గట్టెదను

సుమముల హారము - సంతోషానందతైలము నీదే
స్తుతి వస్త్రము నీదే - ఉల్లాస వస్త్రంబు - నీదే విడుదలయు నీదే
హితవత్సరము విముక్తి - ఆత్మాభిషేకము నీదే

జలములలో బడి దాటునప్పుడు - బలమై యుండెదను
నీతోడై యుండెదను - నదులలో వెళ్లునప్పుడు - నీ పై పారవు
అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిను కాల్చగలేవు

ఇత్తడి తలుపులు బగుల గొట్టెద - ఇనుప గడియలను
విడగొట్టెదను నేను - అంధకార స్థలములో - నున్నట్టి నిధులను
రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను

గర్భమున పుట్టినది మొదలు - తల్లి ఒడిలోన
కూర్చుండినది మొదలు - నేను చంకబెట్టుకొన్న -నాదు ప్రజలారా
ముదిమి వచ్చు వరకు నిన్ను - ఎత్తుకొనువాడను నేనే


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words