
హల్లెలూయ పాటలు
హల్లెలూయ పాటలు - పాడుచుండా - కరములెత్తి స్తోత్రము చేయుచుండా దూతలన్ని వీణెలు - మీటుచుండా హాయి హాయి మన - కెంతో హాయి జీవవృక్షగాలులన్ని - వీచుచుండా - జలజల జీవనదులు పారుచుండా - బంగారపు వీధులలో - తిరుగుచుండా హాయి హాయి మన - కెంతో హాయి స్తుతులకు అర్హుడగు - దేవుడుండా - స్తుతులతో అందరు గొల్వనుండా - తేజోమహిమతో మన - మెగురుచుండా హాయి హాయి మన - కెంతో హాయి నీకు నాకు ఫలంబులన్ని - ప్రభునందుండా - ఎవరికి వారికి తగినట్టి కిరీటము లుండా పరమునందు ప్రభుకాంతి వెలుగుచుండా హాయి హాయి మన - కెంతో హాయి


Follow Us