
హే ప్రభుయేసు
హే ప్రభుయేసు - హే ప్రభు యేసు-హే ప్రభు దేవసుతా సిల్వధరా - పాపహరా - శాంతికరా శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంత నిధీ శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్త నిధీ తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నె గదా విఫలులు జేసిన విజ్ఞాపనలకు - సఫలత నీవె గదా మతములు వెదకిన నిన్నెగదా - వ్రతములు గోరిన నిన్నె గదా పతితులు దేవుని సుతులని నేర్పిన - హితమతి నీవెగదా పలుకులలో నీ శాంతికథ- తొలకరి వానగ గురిసెగదా మలమల మాడిన మానవ హృదయము - కలకలలాడెగదా కానన తుల్య సమాజములో - హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వ పతాకము - దానము జేసెగదా దేవుని బాసిన లోకములో - చావుయె కాపురముండెగదా దేవునితో సఖ్యంబును జగతికి - ఈవిగా నిడితివిగదా పాపము చేసిన స్త్రీనిగని - పాపుల కోపము మండె గదా దాపున జేరి పాపిని బ్రోచిన - కాపరి నీవె గదా ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవె గదా ఖలమయుడగు సాతానుని గర్వము - ఖండన మాయెగదా


Follow Us