
హోసన్ననుచూ స్తుతి పాడుచూ
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం హోసన్నా… హోసన్నా… ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం


Follow Us