
ఆశ్రయమా నా యేసయ్య
ఆశ్రయమా నా యేసయ్య -ఆధారమే నీవయ్యా కృపచూపు వాడవు నీవు -దయచూపు వాడవు నీవు కరుణించువాడవు నీవు -నన్ను ప్రేమించువాడవు నీవు యేసయ్య నీ కృప చాలయ్య యేసయ్య నీ దయ చాలయ్య యేసయ్య నీ కరుణ చాలయ్య యేసయ్య నీ ప్రేమ చాలయ్య (ఆశ్రయమా ) 1.కష్టాల కెరటం నన్ను తాకెను శోకసంద్రం ముంచబోయేను "2" శ్రమల సుడిగాలి ఆవరించెను జీవితనావ తల్లడిల్లెను "2" నా చెంత నీవే నిలిచావు యేసయ్య నా చేయి పట్టి నడిపావు యేసయ్య (యేసయ్య నీ ) 2.ఆకాశమందు నీవు గాక నాకెవరున్నారు నా యేసయ్య ఈ లోకమందు నీవు తప్ప ఆదుకునేవారు ఎవరు లేరు "2" నా తండ్రి నీవే తల్లి నీవే యేసయ్య నా కొండ నీవే కోట నీవే యేసయ్య "2" (యేసయ్య నీ )


Follow Us