
కృప గల దేవుడవు
కృప గల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు "2" గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ స్థితి కేవలం నీ కృపే యేసు నా వెంటే ఉన్నావు యేసు.. నాకు తోడైయున్నావు "2" 1.ఏ అపాయము నను సమీపించక ఏ కీడు నా దరికి చేరక "2" ఆపదలో నుండి విడిపించావు అనుదినము నన్ను కృపతో కాచావు "2" (యేసు ) 2.ఇన్నినాళ్ళు నాకు తోడై ఎన్నో మేలులతో దీవించావు "2" విడువక యెడబాయక తోడైయున్నావు శాశ్వత ప్రేమను నాపై చూపావు "2" (యేసు )


Follow Us