
సార్వభౌముడా నా యేసయ్యా
సార్వభౌముడా నా యేసయ్యా సర్వాధికారం నీదేనయ్యా ప్రభువా నీ పాలనలో ఉన్నందునే.. ధైర్యంగా వున్నానయ్యా... యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా.. సర్వసృష్టి కర్తవే సర్వమును సృజియించితివే నరమాత్రుడనైన నన్ను నీ వలే మార్చుటకు విమోచన అయిననూ విడుదల అయిననూ నీ వల్ల కలిగినవే కదా .. స్తుతియు ఘనత మహిమయు నీదే స్తోత్రబలి అర్పణయు నీకే ఎల్లకాలమునకు యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా.. నిరంతరం ఏలుచున్న వాడవు నీవే సమర్పించుకుందునే సజీవమైన యాగముగా రాజ్యములైనను అధికారులైనను నీ వల్ల కలిగినవే కదా.. రాజ్యము శక్తి బలము నీదే నిత్యారాధన మహిమయు నీకే యుగయుగములు వరకు యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా.. పరలోకభాగ్యము నాకై విడిచిన వాడవు నీవే నిత్య వధువునై ఏకమౌదునే నీలో నిత్యానందములో నిత్యాజీవములో నీతో కలిసి ఏలుదునే నిత్య వెలుగు తేజస్సు నీవే పరిశుద్ధుడ అతిపరిశుద్ధుడవే తరతరముల వరకు యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా యేసయ్యా యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా..


Follow Us