
ఎవరితో నిన్ను పోల్చగలనయ్యా
ఎవరితో నిన్ను పోల్చగలనయ్యా ఏమని నిన్ను పొగడగలనయ్యా..//2// అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు బలవంతుడైన సమాధాన కర్తవు నీవు..//2// దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న శాసనాలు మార్చినావయ్యా.. మరణభయమునా క్రుంగియున్న జనులకు విడుదల ప్రకటించినావయ్యా..//2// నరుల కోసమై భువికి వచ్చిన ఏకైక దేవుడవు నీవయ్యా.. మరణమొందుగా పరము వీడినా నీవంటి దేవుడెవరు యేసయ్యా.. అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు బలవంతుడైన సమాధాన కర్తవు నీవు.. పాప భారము మా ప్రయాసము సిలువలో తొలగించినావయ్యా నీదు ప్రజలకు సమాధానము కృప తో స్థిరపరచినావయ్యా..//2// మృతిని గెలిచిన సత్యవంతుడా నీవంటి దేవుడెవరులేరయ్యా జీవ మార్గము మాకు చూపినా నిన్ను పోలి ఎవరులేరు యేసయ్యా అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు బలవంతుడైన సమాధాన కర్తవు నీవు


Follow Us