
స్తుతించి పాడెదం
స్తుతించి పాడెదం - స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం - ఉదయ సాయంత్రముల్ స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము గతకాలమంతా నీవు - మము కాచి కాపాడావు వ్యధలన్ని తీసావు గతి లేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు కరుణా కటాక్షములను కిరీటములగాను ఉంచావు మా తలపై పక్షి రాజు యవ్వనమువలె మా యవ్వనమునంతా ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు


Follow Us