
అడుగుడి మీకు ఇవ్వబడును
అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని యేసుడు మీతో చెప్పుచుండగా అడగక వెదకక తట్టక తిరుగుచుందురా తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా అడగమని నా యేసు మీకు చెప్పగా అడగక ఈ ఆగడాలు దేనికి ఈ క్షణమే యేసయ్యను చేరుకో అడిగి నీ దీవెనలు పొందుకో పొందుకో దీవెనలు పొందుకో వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా వెదకక ఈ వాదులాట దేనికి వెంటనే యేసయ్యను వేడుకో పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును దొరుకును నీ ఫలములన్ని దొరుకును తట్టమని నా తండ్రి మీకు చెప్పగా తట్టక ఈ తడవులాట దేనికి తక్షణమే తండ్రి తట్టు తిరుగుము తెరువబడిన మార్గములో సాగుము సాగుము మార్గములో సాగుము


Follow Us