
నా హృదయాలోచన నీవేగా
నా హృదయాలోచన నీవేగా యేసు నా హదయాలపన నీవేగా నా హృదయ భావన నా హృదయ తలంపు నా హృదయ స్పందన నీవే కదా కన్నీరు కార్చె వేళలో ఓదార్చినావే నీ ఒడిలో ఆ ఒడియే నీ సన్నిధి - నీ సన్నిధి నాదు పెన్నిధి నీ సన్నిధినిలోనే చివరి వరకు నే జీవించాలి నీ సన్నిధిలోనే తుది శ్వాస విడవాలి దారే తెలియని వేళలో నాతోడు నిలిచావే నీ ప్రేమతో నీ ప్రేమయే నను నడుపును – నీ ప్రేమయే దరికి చేర్చును నీ ప్రేమలోనే చివరి వరకు నే జీవించాలి నీ ప్రేమలోనే తుది శ్వాస విడవాలి


Follow Us