
ఆసీనుడవు కమ్ము యేసు
ఆసీనుడవు కమ్ము యేసు ఆసీనుడవు కమ్ము స్తోత్రాల మీద మా స్తుతుల మీద – ఆసీనుడవు కమ్ము యేసయ్యా పరమందును ఈ ధరయందును - సూచక క్రియలను చేయువాడవు ఆసీనుడవు కమ్మయ్యా - ఆశ్చర్యకార్యములను చేయువాడవు ఆసీనుడవు కమ్మయ్యా అరణ్యములో నా దాగుచోటువు ఎండిన ఎడారిలో జీవజలమువు ఈ అరణ్యములో ఈ ఎడారిలో నీకే స్తోత్రము నీకే స్తుతులు ఈ స్తోత్రమే నీకు సింహాసనం ఈ స్తుతియే నీకు నా అర్పణం మేలు చేసి సంతోషపరతువు శోధించి నను పరీక్షించెదవు ఈ మేలులలో ఈ శోధనలో నీకే స్తోత్రం నీకే స్తుతులు ఈ స్తోత్రమే నీకు సింహాసనం ఈ స్తుతియే నీకు నా అర్పణం


Follow Us