
నమ్మదగిన స్నేహితుడా
నమ్మదగిన స్నేహితుడా - నడిపించే నా నావికుడా తోడు ఉండే ఇమ్మానుయేలా నిత్యము నిలిచే అల్ప ఓమేగా దినమెల్ల నీ ధ్యానం - నా ఆశకు ప్రాణం అనుదినము నీ వాక్యం - నిరీక్షణకు ఆధారం నీ వేయు ప్రతి అడుగు నిను చేరుట కోసం నాలోని ప్రతి ధ్యాస నిను చూచుట కోసం నేనున్నదే నీ కోసం నా హృదయ వేదనలు అతి విస్తారములు నాపై నీ ధ్యానము నాకున్న స్వాస్థ్యము నీ విచ్చు ఈ వారము ఇలలో నా బలము పోరాటములో విజయనాదము - నాకున్నదే నీ జ్ఞానం


Follow Us