LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నాకంటూ ఈ జగాన


నాకంటూ ఈ జగాన - నీవే కదా నా యేసయ్య  
జీవించెద నీ కోసమే - చావైతే నిన్ను చేర ఆశయా
నా ప్రభువా - ఎంత ప్రేమయా - ఊహించలేనయా నాపై నీకున్న దయ 
నాకంటూ ఈ జగాన - నీవే కదా నా యేసయ్య

ఆశల వలయాలు నను చుట్టుకొనగా - కొనఊపిరితో నే పడి ఉండగా
నీ చేతితో నను లేపినావు - నీ ప్రాణమిచ్చి నను కొన్నావు 
ఎంత ప్రేమయా నా యేసయ్య - ఊహించలేనయా

నీ అడుగులలోనే నా ఈ పయనం - నీ సిలువ చెంతనే సేద తీర్చుకొందును 
ఎన్నో ఇక్కట్లు కన్నీటి కష్టాలు - ఎన్నో ఇక్కట్లు కన్నీటి కష్టాలు 
నీ కృపలో ఉందునయా  - ఎంత ప్రేమయా - ఊహించలేనయా నా మంచి  యేసయ్య



Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words