LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ ఆత్మతో నన్ను నడిపించయా


నీ ఆత్మతో నన్ను నడిపించయా – నీ మార్గము నాకు చూపించయా 
నీ సత్యము నాలో కలిగించయ్యా  – నీ చిత్తము నాయందు నెరవేర్చయ్యా
నీ ప్రేమ చూపించయా – నీ స్వరము వినిపించయా
నీ సన్నిధిలోకి నను చేర్చయా – శుధ్ధాత్మను కృమ్మరించయా
కరుణించు దేవా – కృపచూపుమయ్యా 
నా తోడు నీవై – నడిపించేసయ్యా 
నీ ఆత్మతో నన్ను నడిపించయా

చెదిరిపోయి నీనుండి విడిపోతిని – దారితప్పి గురిలేక తిరుగుచున్నాను 
నీ స్వరము వినిపించయా – నీ ముఖము చూపించయా
నీ మార్గములో నడిపించయా – అద్దరికి నను చేర్చయా 
కరుణించు దేవా – కృపచూపుమయ్యా  
నా తోడు నీవై – నడిపించేసయ్యా 
నీ ఆత్మతో నన్ను నడిపించయా

నీ సన్నిధి త్రోసివేసి పారిపోతిని – లోకాశలకు లొంగి పడిపోతిని 
నీ ప్రేమ చూపించయా – నీ వాత్సల్యం దయచేయయా
నీ రక్తముతో నను కడుగయ్యా – నిత్య రాజ్యములో నను చేర్చయా
కరుణించు దేవా – కృపచూపుమయ్యా  
నా తోడు నీవై – నడిపించేసయ్యా
నీ ఆత్మతో నన్ను నడిపించయా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words