
సమర్థుడవైన నా యేసయ్యా
సమర్థుడవైన నా యేసయ్యా సమస్తము నీ వశమైయున్నవి నీవే అనంత జ్ఞానమునకు మూలం నీవే నా సంపదల గనివి ఆరాధన నీకే నా యేసయ్యా సృష్టి యావత్తు నీ మాటచే కలిగెనే నన్ను నూతన సృష్టిగ మలచితివే ఏమి అద్భుతము నీ కృప సంకల్పము ఇది నేనెన్నడు ఊహించనిది కాదయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా నీవు మహిమతో రానున్న ఆ రోజునా నా చేతిని విడువకు నా యేసయ్యా నీ ముఖ సౌందర్యం చూడాలనే ఆశయ్యా అందుకే నీ ఆత్మతో నడిపించుమా ఆరాధన నీకే నా యేసయ్యా నీ రక్షణ జలములలో ఆనందమే నీ అభిషేక తైలములో ఆనందమే నీ సహవాసములో నిలుచుట ఆనందమే ఇది నీ విచ్చిన పరలోక ఆనందమే ఆరాధన నీకే నా యేసయ్యా


Follow Us