
నీతో పోల్చుటకు యేసయ్యా
నీతో పోల్చుటకు యేసయ్యా నీకు సాటి రారు ఎవరైనా దూతలలోనా రాజులలోనా లోకములోనా నీకు నీవే సాటయ్యా రాజులలో నున్న అందరికంటే దీటైన రాజువు నీవయ్యా నాకు దీటైన కోటైన రాజువై నన్ను నడిపించే రారాజు నీవయ్యా శోధనలో నే నున్నప్పుడు నా వైపు చూడని ఎందరో నీవు నాపైన చూపిన ప్రేమకు నా బ్రతుకంతా మారేను మధురముగా లోకములో ఉన్న వారి కంటే లోపము లేని ఘనుడవయ్యా నా లోపాన్ని పాపన్ని కడిగితివి నన్ను నీ సాక్షిగానే మార్చితివి


Follow Us