
మనోహరుడు పదివేలలో అతి సుందరుడా
మనోహరుడు పదివేలలో అతి సుందరుడా మనోహరుడు భువనాలనేల బలశూరుడా ఎంతని నేను వివరించగలను భువి యందు దివియందు నీ మహిమను ఎవరిని నీతో సరిపొల్చగలను తల వంచి స్తుతియించి కీర్తించగ నిన్నే ఆరధించెదను నీలో ఆనందించెదను ని అనురాగమునకై అభివాదము 1. గోపరసమంత సువాసనా నికే సొంతమైనది అడవిలో జల్దరు వృక్షముల అతికాంక్షనీయుడా ఏన్గెది ద్రాక్ష వనమందున కర్పూరపుష్పాల సమానుడా నాకెదురగా నీవు నిలచావని నిన్నే ఆరాధిచెందను నీలో ఆనందించెదను ని అనురాగమునకై అభివాదము 2. ఆరని మారని ప్రేమను నాపై చూపినావు విడని నీడగ నీ కృపను ధ్వజముగు నిలిపినావా మోడైన నా గోడు వినిపించగా నా తోడుగా నీవు నిలిచావుగా నీయందు నే నిలచి ఫలియించగా నిన్నే ఆరాధించేదను నీలో ఆనందించెదను ని అనురాగమునకై అభివాదము 3. కొండలు మెట్టలు దాటుచూ - ప్రియుడెతెంచు వేళ పావుర స్వరము దేశమున వినిపించుచున్నది పై నుండి శక్తిని పొందిందుకు నీ సన్నిధిలో నే నుందును ఆనంద తైలముతో నను నింపినా నిన్నే ఆరాధించేదను నీలో ఆనందించెదను ని అనురాగమునకై అభివాదము 4. పచ్చిక బయల్లే నీవు నేను కలిసే చోటనీ ని మందిరములో ప్రతిదినము నే వేచి యందును వనవాసాలెన్ని అడ్డోచ్చినా మన వాసమెప్పడు మారదులే నా మార్గదర్శివి నీవై నడిపించినా నిన్నే ఆరాధించేదను నీలో ఆనందించెదను ని అనురాగమునకై అభివాదము


Follow Us