
నూతనమైనది నీ వాత్సల్యము
నూతనమైనది నీ వాత్సల్యము.. ప్రతి దినము నన్ను దర్శించేను ఏడాబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు సన్నుతించెదను నా యేసయ్య సన్నుతించెదను నీ నామము గడచిన కాలమంత నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత నీ కృపలోన నన్ను దాచేదవు విడువని దేవుడవు యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను చేయి విడువవు నీ రెక్కలక్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించినావు ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు


Follow Us