
చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా
చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా కృతజ్ఞతస్తుతులు నీకు చెల్లించనా స్వరమెత్తి నీ నామం గానం చేయనా దినమెల్ల నిన్నే కొనియాడనా చేదైన బ్రతుకులో తీపివైనావు చెడిన నాదు బ్రతుకులో మంచివైనావు మధుర ప్రియుడా నా వరుడా యేసయ్య నీవులేకుండా నైను ఉండలేనయ్యా.. ఏమిలేని నాకు సర్వమైనావు ఎవరు లేని నాకు తోడువైనావు శ్రీమంతుడవు నా ప్రియుడా యేసయ్యా సకల దీవెనలతో నను నింపినావయ్యా చీకటైన బ్రతుకులో వెలుగువైనావు మృతుడనైన నాకు జీవమైనావు మృత్యుంజయుడా జయశీలుడా యేసయ్యా నిత్యజీవమకై నన్ను పలచినవయ్యా


Follow Us