
దీనుడు అజేయుడు
దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే స్వరార్చనచేసేదా నీకే - నా స్తుతులర్పించెద నీకే సమ్మతి లేని సుడిగుండాలే - ఆవరించగా గమనము లేని పోరాటలే - తరుముచుండగా నిరుపేదనైనా నా యెడల - సందేహమేమీ లేకుండా హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువ చాటునే దాచావు సంతోషము నీవే - అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే - వజ్రసంకల్పము నీవే సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన - సత్యవంతుడా విరిగి నలిగిన మనసుతో - హృదయర్చనే చేసేద కరుణ నీడలో - కృపవాడలో - నీతో ఉంటే చాలుయ్యా కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే - విజయ శిఖరము నీవేగా ఊహకందని ఉన్నతమైనది - దివ్య నగరమే స్పటికము పోలిన సుందరమైనది - నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమే - మహిమత్మాతో నింపినావు అమరలోకాన - నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో - ఊహల పల్లకి నీవేగా


Follow Us