
కృపగల దేవా దయగల రాజ
కృపగల దేవా దయగల రాజ - చేరితి నిన్నే బహుఘనతేజ నీ చరణములే నే కోరితిని - నీ వరములనే నే వేడితిని సర్వాధికారి నీవే దేవా - నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి - ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదమ నా సర్వమున నీకే దేవా - ఆరాధించి ఆనందించెద నీలో దేవా త్రోవను చూపే తారవు నీవే - గమ్యము చేర్చే సారధి నీవే జీవనయాత్ర శుభప్రదమాయే - నా ప్రతి ప్రార్థన పరిమళమాయే నీ ఉదయకాంతిలో నను నడుపుము - నా హృదిని నీ శాంతితో నింపుము కృప చూపి నన్ను అభిషేకించి - వాగ్దానములు నెరవేర్చినావే బహు వింతగా నను ప్రేమించినావే - బలమైన జనముగా నమ మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును - నీ దివ్యమహిమలను ప్రకటింతును నా యేసురాజ వరుడైన దేవా - మేఘాల మీద దిగివచ్చువేళ ఆకాశవీధిలో కమనీయ కాంతిలో - ప్రియమైన సంఘమై నిను చేరెదను నిలిచెదను నీతోనే సీయోనులో - జీవింతు నీలోనే యుగయుగములు


Follow Us