LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


అమరుడవు నీవు నా యేసయ్య


అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో
సొమ్మసిల్లక - సాగిపోదును సీయోను మార్గములో
స్తోత్ర గీతము - ఆలపింతును నీ దివ్య సన్నిధిలో


శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే
ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధం
లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు
దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు


వేకువ కురిసిన చిరుజల్లులో  నీ కృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు  నవనూతనమే ప్రతిదినము
తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను
కన్న తండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
కమ్మనైన - ప్రేమచూపి - కనువిందు చేసితివి

జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా
జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన
ఆత్మ దీపము - వెలిగించినావు - నీకే ఆరాధన


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words