
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా నా విచారములు కొట్టివేసి - ఆనందము కలుగజేసితివి నాహృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే తగిన సమయములో హెచ్చించునట్లు నను దాచి కాచితివి దీనమనస్సు కలిగి జీవింప నీకృపనిచ్చితివి నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే ఆపత్కాలములో పర్ణశాలలో నను నీవు దాచితివి నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును నా జీవితకాలమంతయు నీ సన్నిధిని నివసింతును నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే అగ్నిశోధనలు నను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో స్నేహబంధముతో బంధించి నను ప్రేమించితివి జేష్ఠుల సంఘముకై నను సిద్ధపరచితివి నా హృదయములో నదివలే సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే


Follow Us