
నీవే హృదయ సారధి
నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా మదిలో చేదుజ్ఞాపకాల విలయవేదిక కూల్చి చిగురాశల దిశగా నను పయనింపజేసినా నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే నీవు లేని జీవితం ప్రళయసాగరమే దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో కనుపాపగ నను కాచిన నామంచి కాపరి చేరనైతి కోరనైతి స్నేహ సౌధము చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా


Follow Us