LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఘనమైనవి - నీ కార్యములు


ఘనమైనవి - నీ కార్యములు - నా యెడల
స్థిరమైనవి - నీ ఆలోచనలు- నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి 
స్తుతులర్పించెదను అన్నివేళలా  అనుదినము  
నీ అనుగ్రహమే - ఆయుష్కాలము - నీ వరమే 
                           

ఏ తెగులు సమీపించనీయక - ఏ కీడైన దరిచేరనీయక 
అపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగేవరకు
నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి.
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
             
 నాకు ఎత్తయిన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే 
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృప కాధారము నీవే 
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
                         

నీ కృప తప్ప వేరొకటి లేదయ్య - నీ మనసులో మేముంటే చాలయా 
బహుకాలముగా నేనున్న స్థితిలో - నీకృప నా ఎడ చాలునంటివే
నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువ
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words