
నమ్మినరోజే చూశానయ్య
నమ్మినరోజే చూశానయ్య నీ మహిమ నా ఆత్మకు దూతవు నువ్వేనయ్య యేసయ్యా అపరాధినైనరోజున మన్నించావు చాలయ ఆరాధనుండేచోటున దూరంగా నువు లేవయ 1. విలవిలలాడినరోజున తోడున్నావయ్యా కళకళలాడేరోజులు రప్పించావయ్యా నా ఆధారము నువ్వే నా ఆహారము నువ్వే నా ఆలోచన నువ్వే నా అనురాగము నువ్వే నిను పూజించే అభిమానిగా నేమారిపోయాను 2. బాధను మింగే ఓపిక ఏర్పరచావయ్యా ప్రార్థన చేసే తీరిక కల్పించావయ్యా నా ఆర్భాటము నువ్వే నా అంతస్తువు నువ్వే నా బహుమానము నువ్వే నా కిరీటము నువ్వే నిను సంధించే నీ వధువుగా నేమారిపోయాను 3. తండ్రీ అని పిలిచేందుకు యోగ్యతలేదయ్యా వేరేవారిని పూజించే కోరికలేదయ్యా నా శిక్షకుడౌ నువ్వే నా సామ్రాజ్యము నువ్వే నా పంజరము నువ్వే నా పరిహారము నువ్వే నిను ప్రకటించే బోధకునిగా నేమారిపోయాను


Follow Us