
నా మదిలోని ఆనందమా
నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలో అనురాగమా యేసయ్యా.... ఎన్నితరాలకైన యేసయ్యా.... మాస్థితులేవైన మాట తప్పేవాడవు కానేకావయా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్య నా నడకలో నీ అడుగు ఉందనీ నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేననీ నీవు లేకుండా ఈ పయనం సాగదనీ... నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్య నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ.... నీ అనురాగమే కొండంత అండనీ.... సాక్షిగుంటానయ్యా నిను విడచి మనలేనయ్య నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్య


Follow Us