
ఆనందం యేసుతో
ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో పాడెదను జయరాజాధిరాజుతో సాగెదను ||ఆనందం|| నా ప్రాణమునకు సేదదీర్చి తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను ఏ అపాయమునకు నేను భయపడకుందును ||ఆనందం|| నా ప్రభుని కృప చూచిన నాటినుండి నన్ను నేనే మరచిపోతినే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా ||ఆనందం|| సిలువను యేసు సహించెను తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై అవమానము నొందె - నాకై మరణము గెలిచె ||ఆనందం||


Follow Us