LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను


ఐక్యతను ఇవ్వవా ప్రభూసమైక్యతను మా సహోదరులలో ఉంచవా

1. పెట్టినాడయా సాతాను కలహంబులను
చెదరగొట్టి నాడయా విశ్వాసులను
గద్దించవా తండ్రి అపవాదిని
ఆత్మ బలమును మాకియ్యవా ప్రభు ||ఐక్యత||

2. సడలిన మా చేతులను బలపరచయ్యా
కృంగిన మా కాళ్ళను ద్రుడపరచయ్యా
తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా
విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా ||ఐక్యత||

3. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా
యుద్ధములో జయమును మాకు ఇమ్మయ్యా
జీవింపజేయుమా నీ ఆత్మ ను
ఆత్మల భారము మాకీయవా ప్రభు ||ఐక్యత||

4. కాచినావు సంఘమును నీ దయ వలెనే
నింపినావు బండపై నీ కృప వలెనే
చిరకాలం ఐక్యతనే బంధకములతో, 
సిద్ధ పరచయ్యా నీ రాకడ కొరకు ||ఐక్యత||




Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words