
భీకరుని బాహుబలము తక్కువైనదా
భీకరుని బాహుబలము తక్కువైనదా మన కొరకు కార్యములను చేయలేనిదా సహనము విడువకా కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా యెహోవాకు సాధ్యం ఏదైన ఉన్నదా నమ్మదగిన సహయం ఆయనే గదా. బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్ధ్యం ఆవిరైనదా సింహపు నోటికి తాళము వేసిన దేవుని వాగ్దానం ధైర్యపరచదా ఎదురొచ్చిన శ్రమలో కలవర పెట్టిన భ్రమలో నీయందలి విశ్వానం అల్పమైనదా సంద్రం మధ్యలో దారిని వేసిన దేవుని వాత్సల్యం భద్రపరచదా అనుమానపు శృతిలో తెగులుతో తప్పిన జతిలో నీకుండిన మాధుర్యం మాయమైనదా ఎండిన ఎముకలో జీవముపోసిన దేవుని వాక్ శక్తి స్వస్థపరచదా


Follow Us