
కలిసిపాడెదం నూతన గీతం
కలిసిపాడెదం నూతన గీతం సీయోను పురములో పరిశుద్ధులతో సింహాసనాసీనుడ సీయోను రాజా మనసార పాడుచు కీర్తించెదం హల్లెలూయ హల్లెలూయ అనుచు కీర్తనలతో హల్లెలూయ హల్లెలూయ అనుచు గానాలతో ||2|| 1.నాశనకరమైన మరణము నుండి మోసకరమైన ఊబి నుండియు ||2|| కరుణించి మమ్మును కాపాడి బ్రతికించి మమ్మును నడిపించి ఉప్పొంగు హృదయముతో ప్రియుడేసు సన్నిధిలో ఆనదించెదన్ నేను పరశించెదను.|| హల్లెలూ || 2.నా తోడు నీవై నా ప్రేమ నీవై నీ సాటి లేరు నా కెవ్వరు తల్లివై నా తండ్రివై అన్నవై నా స్నేహమై ఉప్పొంగు హృదయముతో ప్రియుడేసు సన్నిధిలో ఆనదించెదన్ నేను పరశించెదను.|| హల్లెలూ || 3.నీ రెక్కల క్రింద ఆశ్రయమిచ్చి నీ బలిపీఠము నొద్ద నిలబెట్టితివి ఆత్మతో దైవ భాషలతోవరములతో ఆత్మ ఫలములతో ఉప్పొంగు హృదయముతో ప్రియుడేసు సన్నిధిలో ఆనదించెదన్ నేను పరశించెదను.|| హల్లెలూ ||


Follow Us