
ఎరిగియున్నానయా
ఎరిగియున్నానయా - నీకేదీ అసాధ్యము కాదని తెలుసుకున్నానయా - నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు - మాకొరకు దాచి ఉంచినావని నను చుట్టుముట్టిన బాధలతో - నాహృదయం కలవరపడగా - నా స్వంత జనుల నిందలతో - నా గుండె నాలో నీరైపోగా అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే మిక్కుట ప్రేమను చూపితివే - నను ఓదార్చితివే మించిన బలవంతుల చేతినుండి - తప్పించిన యేసు దేవుడా - వంచనకారుల వలలనుండి - రక్షించిన హృదయ నాధుడా నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే


Follow Us